జేమోలోజికాల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అమెరికా (Gemological Institute of America) ప్రకారం 1896 వరకు, ఒక్క భారత దేశం లోనే వజ్రాలు దొరికేవి, వజ్రాల గనులు ఉండేవి.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన క్రికెట్ గ్రౌండ్ చైల్(Chail) , హిమాచలప్రదేశ్ లో ఉంది. 1893 ఒక ఎత్తయిన కొండ మీద దీనిని నిర్మించారు. ఈ మైదానం సముద్రమట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తన్నమాట.
భాస్కరాచార్య కొన్ని వేల సంవత్సరాల క్రితం, (క్రీ.శ 1114) భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని లెక్క కట్టారు. ఆయన లెక్క ల ప్రకారం అది 365.258756484 రోజులు.
అమెరికన్లు మరియు యూరోపియన్లు సుమారు $17 బిలియన్లు తమ పెంపుడు జంతువుల మీద ఖర్చు పెడుతారు. ప్రపంచం లో మూడోవంతు జనాభా రోజుకు $2 కన్నా తక్కువ ఖర్చు తో బ్రతుకుతుంది. ఇంకా విషాదమేమిటంటే సుమారు 1.2 బిలియన్ల జనాభా రోజుకు $1 కన్నా తక్కువ ఖర్చు తో బ్రతుకుతుంది.
అమెరికా లో ఉన్న క్రెడిట్ కార్డులన్నీ సేకరిస్తే సుమారు 304 టన్నుల బరువు తూగుతుందని అంచనా.. ఇది దాదాపు 61 ఏనుగుల బరువుకి సమానం. వీటిని ఒకదాని వెనక ఒకటి పరిస్తే, 16,223 మైళ్ళ పొడవు ఉంటుంది.