ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, ఏప్రిల్ 2010, గురువారం

వజ్రాల గనులు

జేమోలోజికాల్  ఇన్స్టిట్యూట్ అఫ్ అమెరికా (Gemological Institute of America) ప్రకారం 1896 వరకు, ఒక్క భారత దేశం లోనే వజ్రాలు దొరికేవి, వజ్రాల గనులు ఉండేవి.

అతి ఎత్తయిన క్రికెట్ గ్రౌండ్

ప్రపంచంలోనే అతి ఎత్తయిన క్రికెట్ గ్రౌండ్ చైల్(Chail) , హిమాచలప్రదేశ్ లో ఉంది. 1893 ఒక ఎత్తయిన కొండ మీద దీనిని నిర్మించారు.  ఈ మైదానం సముద్రమట్టానికి 2444 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సుమారు 2.5 కిలోమీటర్ల ఎత్తన్నమాట.

భారతీయ రైల్వే

ప్రపంచంలో అతి ఎక్కువమంది ఉపాధి పొందేది మన భారతీయ రైల్వే లో నే. సుమారు 14 లక్షల మంది పనిచేస్తున్నారు.

7, ఏప్రిల్ 2010, బుధవారం

భాస్కరాచార్య

భాస్కరాచార్య కొన్ని వేల సంవత్సరాల క్రితం, (క్రీ.శ 1114) భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని లెక్క కట్టారు.  ఆయన లెక్క ల ప్రకారం అది 365.258756484 రోజులు.

రోజుకు ఖర్చు: పెంపుడు జంతువులు

అమెరికన్లు మరియు యూరోపియన్లు సుమారు $17 బిలియన్లు తమ పెంపుడు జంతువుల మీద ఖర్చు పెడుతారు. ప్రపంచం లో మూడోవంతు జనాభా రోజుకు $2 కన్నా తక్కువ ఖర్చు తో బ్రతుకుతుంది. ఇంకా విషాదమేమిటంటే సుమారు 1.2  బిలియన్ల జనాభా రోజుకు $1 కన్నా తక్కువ ఖర్చు తో బ్రతుకుతుంది. 

5, ఏప్రిల్ 2010, సోమవారం

భారత దేశం : మసీదులు

భారత దేశం లో సుమారు 300,000 మసీదులు ఉన్నాయి. ఇవి ప్రపంచం లోని ఈ ఇతర దేశంలో కన్నా ఎక్కువే. ముస్లిం దేశాలు కూడా ఈ రికార్డుని అధికమించలేదు.

ఇస్లాం భారత దేశం

ఇస్లాం ప్రపంచం లో రెండవ అతి పెద్ద మతం. అలాగే భారత దేశం లో కూడా...

భారత దేశం: పోస్టు ఆఫీసు

భారత దేశం అతి పెద్ద సంఖ్యలో పోస్టు ఆఫీసులను కలిగిఉంది. ప్రస్తుతం భారత దేశంలో 1,55,669 పోస్టు ఆఫీసులు పని చేస్తున్నాయి. 

భారత దేశం

భారత దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, విస్తీర్ణం లో 6వ పెద్ద దేశం, జనాభాలో 2వ పెద్ద దేశం.

కరన్సీ నోట్లమీద బ్యాక్టీరియా?

కొన్ని పరిశోధనల ప్రకారం, సుమారు 93 రకాల బ్యాక్టీరియా ( ఈ- కొలీ , యస్-aureus) మనం చేతులు మార్చుకొనే కరన్సీ నోట్లమీద ఉంటుందట..

బ్యాంకు నోట్లు

బ్యాంకు నోట్లను పేపరు తో తయారు చెయ్యరు. ఒక ప్రత్యేకమయిన నూలు (Cotton) మరియు లినెన్ (Linen) అనే మిశ్రమం తో తయారు చేస్తారు.

1, ఏప్రిల్ 2010, గురువారం

మొట్టమొదటి వైద్య గ్రంధం

ఆయుర్వేదం మానవుడికి తెలిసిన మొట్టమొదటి వైద్య గ్రంధం. వైద్య పితామహుడయిన చరకుడు సుమారు 2500 సంవత్సరాల క్రితం దీనిని రూపొందించారు...

అమెరికా లో ఉన్న క్రెడిట్ కార్డుల బరువు?

అమెరికా లో ఉన్న క్రెడిట్ కార్డులన్నీ సేకరిస్తే సుమారు 304 టన్నుల బరువు తూగుతుందని అంచనా.. ఇది దాదాపు 61 ఏనుగుల బరువుకి సమానం. వీటిని ఒకదాని వెనక ఒకటి పరిస్తే, 16,223 మైళ్ళ పొడవు ఉంటుంది.

29, మార్చి 2010, సోమవారం

జీబ్రాల రంగు

జీబ్రాల అసలు రంగు తెలుపు. కనిపించే నల్ల చారలు వాటి పై చర్మం మీదవి మాత్రమే.

దురాక్రమణ

గడచిన 1,00,000 సంవత్సరాలలో భారత దేశం, ఏ దేశం మీదా దురాక్రమణ చెయ్యలేదు.

మొట్టమొదటి చలువరాతి ప్రార్ధనాలయం

ప్రపంచం లో మొట్టమొదటి చలువరాతి ప్రార్ధనాలయం బృహదీశ్వరాలయం. ఇది తంజావూర్, తమిళ్ నాడు  లో ఉంది. కట్టించింది రాజ రాజ చోళుడు. కేవలం ఐదు సంవత్సరాలలో కట్టించారు…. (1004 AD , 1009 AD మధ్యలో)

Bank (బ్యాంకు)

Bank (బ్యాంకు) అనే పేరుకి మూలాలు ఇటలీలో ఉన్నాయి….. ఇటలీ లో “banco” అంటే "desk/bench" అని అర్థం. ఇటలీ లో యూదు బ్యాంకర్లు తమ లావాదేవీలు ఆకు పచ్చని వస్త్రం కప్పిన బెంచి లేదా మేజా మీద జరిపేవారు.

3, మార్చి 2010, బుధవారం

బ్యాంక్ ( Bank)

బ్యాంక్ (Bank) అనే ఆంగ్ల పదం Banco అనే ఇటలీ పదం నుంచి పుట్టింది.